లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు...బుసా చెముడు
on Dec 3, 2024
హర్ష చెముడు అంటే చాలు సుందరం మాష్టర్ రోల్ గుర్తొస్తుంది. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ యుట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తరువాత మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు వైవా హర్ష. వైవా అనే షార్ట్ ఫిలిం తో హర్ష అప్పట్లో బాగా ఫేమస్ అయ్యాడు. దాంతో వైవా పేరు కాస్తా ఇంటి పేరుగా మారిపోయింది. కామెడీ టైమింగ్ కూడా అదిరిపోతోంది కాబట్టి హర్ష అంటే చాలు ఆడియన్స్ లో మంచి ఇంప్రెషన్ ఉంది. అలాంటి హర్షకి బైక్స్ అంటే చాలా ఇష్టం. దాంతో రీసెంట్ గా ఒక అదిరిపోయే బైక్ కొన్నాడు.
అది కూడా స్పోర్ట్స్ బైక్. సుజుకి హయబుసా 1300 సిసి మోడల్ బైక్. ఈ బైక్ ధర దాదాపుగా 15 లక్షలు ఉంటుందని తెలుస్తుంది. హర్షకి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం అందుకే అప్పుడప్పుడు రేసింగ్ కి కూడా వెళుతుంటాడట. ఇప్పటికే అతని గ్యారేజ్ లో రేసింగ్ కు సంబంధించిన చాలా బైక్స్ ఉన్నాయంటూ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు వేరే దేశం నుంచి ముచ్చట పడి మరీ ఈ స్పోర్ట్స్ బైక్ ను తెప్పించుకున్నాడట. అంతగా ఇష్టపడి కొనుకున్న బైక్ నిహర్ష తన భార్య అక్షర చేతుల మీదుగా స్టార్ట్ చేయించాడు. ఇక నెటిజన్స్ ఐతే హర్షని తెగ పొగిడేస్తున్నారు. ఒక నెటిజన్ ఐతే "మీ ఇంట్లోకి ఒక కొత్త మెంబర్ రావడం చూస్తుంటే సంతోషంగా ఉంది..బుసా చెముడు ..హార్టీ కంగ్రాట్యులేషన్స్ ...లైఫ్ లాంగ్ కిక్కు ప్రాప్తిరస్తు...ఒక్కసారి హయబుస్స మీద ప్రేమ పెరిగితే అది ఎప్పటికీ పోదు ..మీలాగే బైక్ కూడా ముద్దుగా, బొద్దుగా ఉంది. " అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా వైవా హర్ష హయబుసా బైక్ కి ఓనరయ్యాడు.
Also Read